మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎంఆర్
భూత్పూర్, ఆగస్టు 26: మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామంలో మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని జామా మసీదులో మిలాద్ ఉన్ నబి వేడుకల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం లందరికీ మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు రూ. ఐదు లక్షల నిధులతో చేపట్టిన ఈద్గా విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి, కౌన్సిలర్లు కేంద్యాల పద్మ, లత సూరన్న గారి, కోఆప్షన్ మెంబర్లు పవన్, అప్రోజ్, ముస్లిం కమిటీ సభ్యులు డాక్టర్ పాషా, అజీజ్, ఖాజా పాషా , మౌలానా, మహమూద్, లడ్డు, ఖాజా పాషా తోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరేందర్, మట్టి ఆనంద్, మనన్ తదితరులు పాల్గొన్నారు.






