2 April, 2026 | 3:18 AM

విప్ బీర్ల ఐలయ్య చిత్రపటానికి క్షీరాభిషేకం

02-04-2026 12:04 AM

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 1 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల భద్రత కోసం హామీ ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు రాష్ట్ర టెక్నికల్  అసిస్టెంట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కొండమడుగు రమేష్  కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట  కొండకింద గోపురం వద్ద ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, రెటైర్మెంట్స్ బెనిఫిట్స్, ప్రతినెల జీతాలు సరిగా రావడం లేదని, యాదగిరిగుట్టలో రాష్ట్ర స్థాయి టెక్నికల్ అసిస్టెంట్ సమావేశము ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉపాధి హామీ కాంట్రాక్టు ఉద్యోగులకు అండగా ఉంటానని విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకు వస్తానని హామీ ఇవ్వడం జరిగిందని.

ఇచ్చిన హామీ మేరకు శాసనసభ  సమావేశాల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల అందరికీ ఉద్యోగ బద్రత కల్పించాలని వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు  రాష్ట్ర టెక్నికల్ అసిస్టెంట్  జిల్లా అధ్యక్షులు కొండమడుగు రమేష్   కాంట్రాక్టు ఉద్యోగుల తరఫున హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, ఉద్యోగ సమస్యలు పరిస్కరం అయ్యేవరకు మనిఫెస్టోలో పెట్టిన విదంగా మా సమస్యలు పరిష్కరించే వరకు మాకు అండగా వుంటారని మాకు ఆ నమ్మకం ఉందని అన్నారు. ఈ కార్యక్రములో ఉపాధి హామీ కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.