calender_icon.png 15 August, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖానాపూర్ వాసులకు రహదారి ఇక్కట్లు

15-08-2025 05:15:37 PM

సెంట్రల్ లైటింగ్ పోల్ ను ఢీకొన్న లారీ

తృటిలో తప్పిన ప్రమాదం

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పట్టణవాసులకు రహదారి ఇక్కట్లు అంతా కాదు. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న ఖానాపూర్ పట్టణాన్ని గత ప్రభుత్వం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి దానికోసం పట్టణంలోని ప్రధాన రహదారిని వెడల్పు చేయడంలో భాగంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. కానీ ఇరువైపులా రోడ్డు వెడల్పు చేయడం విడిచిపెట్టారు. దీంతో ఖానాపూర్ పట్టణం మొదటి నుంచి బస్టాండ్ వరకు రోడ్డు ఇరుకుగా మారి కొన్ని ఏళ్లుగా పట్టణవాసులకు ప్రయాణం ఇబ్బందిగా మారింది.

ఈ పట్టణం సుమారు మూడు జిల్లాలకు ప్రధాన కూడలిగా మారడం ఈ దారి గుండనే జగిత్యాల జిల్లా మెట్టుపల్లి, మల్లాపూర్, మంచిర్యాల వాహనాలకు రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంటుంది .ఇటీవల భారీ వాహనాల రాకపోకలు విరివిగా పెరగడంతో ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రజలు దడుచుకుంటున్నారు. కొంతమేర విశ్రాంతి భవనం నుంచి ప్రభుత్వ కళాశాల వరకు రోడ్డు వెడల్పు చేయగా, కళాశాల నుంచి తెలంగాణ చౌక్ వరకు అక్కడి నుంచి ఇంద్రానగర్, పోలీస్ స్టేషన్ వైపు, దాంతోపాటు దిలావర్పూర్ వెళ్లే మార్గాలు పూర్తి ఇరుకుగా ఉండడంతో తెలంగాణ చౌకు, బస్టాండు, పాత బస్టాండ్ వద్ద వాహనాలు ప్రయాణికుల రద్దీ పెరిగి నిరంతరం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

నేపథ్యంలోనే గురువారం రాత్రి లారీ అడ్డ, మసీదు సమీపంలో ఒక లారీ వేగంగా వచ్చి డివైడర్, సెంట్రల్ లైటింగ్ స్తంభాన్ని ఢీకొట్టింది. దాంతో స్తంభం పూర్తిగా విరిగిపోయి పనికిరాకుండా పోయింది. కాగా సుమారు 24 గంటలు శ్రమించి పోలీసులు లారీని ప్రోక్ లైనర్లతో తీపిచ్చి రహదారిని పునరుద్ధరించారు. ఇంత సమయం ప్రయాణికులు రాకపోకులకు తీవ్రంగా శ్రమించారు. కాగా స్థానిక నాయకులు స్పందించి వెంటనే ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాల ,మసీదు, లారీ అడ్డా, తెలంగాణ చౌక్, ఇంద్రానగర్, దిలావర్పూర్ రోడ్లను వెడల్పు చేసి పట్టణ ప్రజల సమస్యలు తీర్చాలని పలువురు వేడుకుంటున్నారు.