calender_icon.png 15 August, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్స్ బహుకరణ

15-08-2025 05:23:20 PM

నకిరేకల్,(విజయక్రాంతి):  కట్టంగూరు మండలంలోని చెర్వు అన్నారంలోని ప్రభుత్వ హైస్కూల్, ప్రైమరీ పాఠశాలకు 79వ స్వతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్ కెన్జియం సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ నుంచి చిలుముల రామకృష్ణ అడ్మిన్ అండ్ ప్రొక్యూర్మెంట్ మేనేజరు సహకారంతో  ఐదు కంప్యూటర్లు హై స్కూల్ కి రెండు కంప్యూటర్స్ఈరోజు చెరువు ఆన్నారం హై స్కూల్, ప్రైమరీ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో కెన్జియం సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ నుంచి చిలుముల రామకృష్ణ అడ్మిన్ అండ్ ప్రొక్యూర్మెంట్ మేనేజరు సహకారంతో హై స్కూల్ కుఐదు కంప్యూటర్లు ప్రైమరీ స్కూల్ కు రెండు కంప్యూటర్ లనుబహుకరించారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ ఈ పాఠశాలలోనే చదువుకున్నాను. తాను చదువుకున్న పాఠశాలకు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా స్కూల్ అభివృద్ధికి సహకరించాలని ఉద్దేశంతో మా కంపెనీతో మాట్లాడి కంప్యూటర్స్ అందించామని ఆయనతెలిపారు. విద్యార్థులమంచిగా చదువుకొని కంప్యూటర్, పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు.  కంప్యూటర్ నైపుణ్యం కలిగిన విద్యార్థులుగా ఎదిగి తమ లక్ష్యం కోసం కృషి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాల బలుపేతం కోసం, గ్రామ పెద్దలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మేధావులు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.