calender_icon.png 15 August, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

15-08-2025 05:28:22 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి  పోలీస్ స్టేషన్ నందు 79వ భారతదేశ స్వతంత్ర దినోత్సవాన్ని  తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి  మరియు సిబ్బంది ఘనంగా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన పూర్వీకులు, స్వాతంత్ర్య  సమరయోధుల పోరాటాలు, వాళ్ళ ధైర్య సాహసాలు, త్యాగాలు, ఆత్మ బలిదానాలు  ఎంతోమంది ఎన్నో విధాలుగా చేసి చివరకు స్వాతంత్రం సాధించటం జరిగినది.  వాళ్లు చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు అన్ని మరల ఒక్కసారి స్మరించుకొని, మన భారతదేశపు మువ్వన్నెల  జాతీయ పతాకాన్ని గౌరవంగా, గర్వంగా పతాకావిష్కరణ చేయటమైనది.