calender_icon.png 2 May, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

02-05-2025 12:20:25 AM

కరీంనగర్, మే 1 (విజయ క్రాంతి): దేశవ్యాప్తంగా జనాభా లెక్కల తో పాటు కులగణన చేపట్టాలని ప్రధాని మోదీ, కేంద్ర క్యాబినెట్  తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బిజెపి కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం రోజున తెలంగాణ చౌక్ లో ప్రధాని మోదీ చిత్రపటానికి క్షరాభిషేకం చేశారు.

ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగనన చేపట్టడం సాహసోపిత,  చారిత్రక నిర్ణయమన్నారు. 48 ఏళ్లు దేశంలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్  జనాభా లెక్కల్లో ఎప్పుడు కులగణనను చేపట్టలేదు కానీ నేడు దేశవ్యాప్తంగా కుల గణన జరగాలని ముసలి కన్నీరు కారుస్తూ పనికిమాలిన రాజకీయ డ్రామాలు చేసిందని విమర్శించారు. 

 కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలకు రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగాల పరంగా ఎంతో ప్రయోజనం కలగబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దూలం కళ్యాణ్ , మాజీ కార్పొరేటర్ కోలగని శ్రీనివాస్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్ , స్టేట్ కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు  ఓబిసి మో ర్చ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు చిట్టిబాబు  , నగర జోన్ అధ్యక్షులు అవదుర్తి శ్రీనివాస్, జాడి బాల్ రెడ్డి , మామిడి చైతన్య, తదితరులు పాల్గొన్నారు.