02-05-2025 12:19:26 AM
బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చందుపట్ల సునీల్ రెడ్డి
మంథని, మే 1 ః విజయ క్రాంతి దేశంలోని ప్రజలందరికీ కులగణాన తో పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని పెద్దపల్లి జిల్లా మాజీ బిజెపి అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు.
గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సునీల్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ తీసుకున్న కులగణాన నిర్ణయం చరిత్ర ఆత్మకమని, దేశంలోని అన్ని కులాల ప్రజల, వారి ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని వారికి న్యాయం చేసేందుకే దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుం దన్నారు. మొన్న అసెంబ్లీలో ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారని, దానిలో ముస్లింలను కలుపుకొని బీసీ రిజర్వేషన్ ఇవ్వడం తో బీసీలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు.
మంథనిలో డివిజన్ క్లబ్ ఏర్పాటు శుభపరిణామం
మంథని కేంద్రంగా మంథని డివిజన్ మీడియా ప్రెస్‌క్లబ్ ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామమని చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. మీడియా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మీడి యా మిత్రులను సన్మానించారు. ఆయన వెంట బిజెపి నాయకులు పోతరవేణి క్రాంతికుమార్, కృష్ణ, అశోక్ పాల్గొన్నారు.