02-05-2025 07:34:14 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): భారతదేశవ్యాప్తంగా కుల గణన చేయడానికి కృషి చేసిన పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టణ అధ్యక్షుడు గణపురం అంజయ్య ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు బీసీ లిక్వేషన్ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పూల గణన చేయాలని చెప్పిన సందర్భంగా పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కుల గణనకు తీవ్ర కృషి చేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పోరాట ఫలితంగానే 11 ఏళ్ల తర్వాత బిజెపి ప్రభుత్వం కుల గణనకు ముందుకు వచ్చిందని చెప్పారు. బీసీ కుల గణన వల్ల రిజర్వేషన్లు పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రామదాసు, శ్రీనివాస్, యాకూబ్, చిరంజీవి, దేవ్ సింగ్, రాజమ్మ, సరస్వతి, రంజిత్, పరశురాం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.