02-05-2025 06:50:17 PM
కల్లూరు,(విజయక్రాంతి): వెన్నెల పల్లి గ్రామ పంచాయితీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో అందరూ ఉత్తీర్ణు త సాధించారు సందర్భంగా వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ మాజీ సర్పంచ్ కొండపల్లి శ్రీమన్నారాయణ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఉత్తీర్ణులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు అందరిని అభినందించి, ఇలాగే పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికీ చేరాలన్నారు.
మీరు చదివి నా పాఠశాల, గ్రామానికి, మి తల్లిదండ్రులకు, విద్యా నేర్పిన గురువులకు మంచి పేరు ప్రతిష్ఠ లు తీసుకోని రావాలి కోరారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థికి ప్రోత్సాహకంగా వెయ్యి రూపాయలు అందజేసినారు.ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్దలు పాల్గొన్నారు