calender_icon.png 7 October, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిల్లర్లు సీఎంఆర్ టార్గెట్‌ను పూర్తి చేయాలి

07-10-2025 12:00:00 AM

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 

 కామారెడ్డి, అక్టోబర్ 6 (విజయక్రాంతి):  కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారము జిల్లా కలెక్టర్‌ఆశీష్ సంఘ్వాన్ ఆధ్వర్యంలో  సిఎంఆర్ రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశము ఐ డి ఓ సిమీటింగ్ హాల్ లో నిర్వహించారు.ఖరీఫ్ 2024-25 సీజన్లలో బకాయి ఉన్న మిల్లర్లను గడువు తేదీ నవంబర్ 12లోగా సిఎంఆర్ పూర్తి చేయాలని కోరారు.  రోజు వారీ టార్గెట్ పూర్తి చేయాలని అన్నారు, ప్రతి మిల్లును    ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ  చేయాలని  ఆదేశించారు. 

ప్రస్తుతం ప్రారంభం అయిన ఖరీఫ్ -2025-26 సీజన్ కి దాన్యం సేకరణకు కి గాను మిల్లుకు కేటాయించిన దాన్యాన్ని దించుకొని వెంటేనే ట్రక్ చిట్ ని పి పి సి  సెంటర్ ఇంచార్జీలకు ఇవ్వాలని సూచించారు. మిల్లర్ అక్నాలెడ్జిమెంట్ చేయాలని, ఇందువలన రైతు కు త్వరగా డబ్బులు ఖాతాలో జమ అవుతాయని  మిల్లర్లకు ఆదేశించారు, ఈ సమీక్ష సమావేశములో జిల్లా కలెక్టర్ (పౌర సరఫరాలు), ఎఫ్ సి ఐ డిపో మేనేజర్, నిజామాబాద్  జిల్లా సివిల్ సఫ్లై అధికారి  జిల్లా మేనేజర్ పౌర సరఫరాల సంస్థ అధికారులు తదితరులు  పాల్గొన్నారు.