07-10-2025 12:00:00 AM
వేములపల్లి అక్టోబర్ 6 విజయ క్రాంతి : డ్రగ్స్ తో జీవితం మసి డ్రగ్స్ మానేస్తే జీవితం ఖుషి అని తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ అన్నారు. సోమవారం ఫ్లెక్సీ, హ్యాండ్ మైకుతో యువతకు భీమారం సూర్యాపేట రోడ్డు సల్గునూరు క్రాస్ రోడ్డుపై యువత డ్రగ్స్ మానేయాలంటూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజులలో యువత మత్తుకు బానిసై తమ బంగారు భవిష్యత్తును ఆగం చేసుకుంటున్నారన్నారు.
యువత తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లలు మంచి మార్గంలో నడిచి మంచి భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆలోచనతో అహర్నిశలు కష్టపడుతున్నారు. కానీ కొంతమంది యువకులు చెడు మార్గంలో పయనిస్తూ మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మత్తు రహిత సమసమాజ స్థాపన కోసం తమవంతుగా కృషి చేస్తున్న సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తూ వేములపల్లి మండలంలోని పలు గ్రామాలు తిరుగుతూ యువతకు మత్తు దిశ నిర్దేశం చేస్తున్న రాచకొండ ప్రభాకర్ను పలువురు అభినందించారు.