14-05-2025 11:41:25 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): మద్యానికి బానిసై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... స్థానిక శ్రీనివాస్ నగర్ కు చెందిన పెండెల రామకృష్ణ(40) అనే వ్యక్తి సింగరేణి కార్మికుడు గత కొద్దిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. మృతుడు మంగళవారం ఎండలో వచ్చిన తను తిరిగి బుధవారం ఉదయం ఇంటి నుండి బయటికి రాకపోవడంతో ఇరుగు పొరుగు వారు మృతుని బంధువులకు, పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు.ఎండలో తిరిగి రావడం వలన వడదెబ్బ తాకి మృతి చెందివుంటారని మృతుని బందువులు ఫిర్యాదు చేయగా ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.