05-01-2026 05:50:06 PM
పోలీస్ శాఖలో కొత్త ట్రెండుకు శ్రీకారం
సవాళ్లు ఎదుర్కొని సమస్యలు పరిష్కరిస్తూ
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జానకి షర్మిల రెండేళ్ల పదవీకాలంలో నిర్మల్ జిల్లాలో పోలీస్ మార్క్ చూపించింది. నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అంటూ లక్ష్యంగా చేసుకొని ఓ మహిళ ఐపీఎస్ అధికారిగా రెండు సంవత్సరాల క్రితం జనవరి 4న నిర్మల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రాజకీయ చైతన్యం ఉన్న నిర్మల్ జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన జానకి షర్మిల జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో సైతం పోలీస్ సేవలను విస్తరించి శాంతి భద్రతల పరిరక్షణ అక్రమ మద్యం అమ్మకాలు గంజాయి ఆర్థిక నేరాలు కుటుంబాలకు భరోసా వంటి వినూత్న కార్యక్రమంతో ప్రజల మెప్పును సాధించింది. జిల్లాలో రెండేళ్లలో బిట్ కాయిన్ ఆర్థిక నేరంతో పాటు సంఘవిద్రోహుల పట్ల కఠినంగా వివరించింది ఎన్నో అంతర్ రాష్ట్ర కేసులను ఛేదించింది
మహిళా పోలీస్ మార్క్
నిర్మల్ జిల్లాలో మహిళా ఐపీఎస్ అధికారి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన జానకి షర్మిల జిల్లాపై పూర్తి అవగాహన పెంచుకున్నారు ప్రజలతో మమేకమైనందుకు పోలీస్ అక్క శివాంగి దళం మహిళా పోలీసులతో ఏర్పాటు చేశారు ఈ సిబ్బంది ద్వారా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడ మహిళల రక్షణకు చర్యలు విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధం ఆర్థిక నేరాల నియంత్రణ కుటుంబ సమస్యల పరిష్కారం పై భరోసా కల్పించే విధంగా భరోసా సెంటర్ ను ఏర్పాటు చేసి విడిపోయిన నూట ఆరు కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించి దాంపత్య జీవితాన్ని తిరిగి సాఫీగా జరిగేందుకు ఎంతగానో కృషి చేశారు. జిల్లాలోని మారుమూల పెంబి మండలంలోని నడిచి వెళ్లలేని మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లి అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని వారికి దుప్పట్లు సోలార్ లైట్లు ఉచిత వైద్యం అవసరాలను గుర్తించి సహాయం చేశారు బైంసా పట్టణ ంలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎలాంటి గొడవలు లేకుండా రెండేళ్లు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా మెప్పు పొందారు రాష్ట్రంలోనే సంచలనం చేసిన దిల్వార్పూర్ ఇత్తనాలు ఫ్యాక్టరీ బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన పంటి కీలక ఆందోళన జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని మేమున్నాం అంటూ భరోసా కల్పించి శాంతి పద్ధతుల రక్షణకు చర్యలు తీసుకున్నారు పోలీస్ శాఖలో సంస్కరణలు చేపట్టి పారదర్శకమైన పాలన రక్షణ పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల మర్యాద అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పోలీస్ శాఖ ఉద్యోగుల పట్ల కూడా గౌరవం పెంపొందించే విధంగా ఆమె తీసుకున్న చర్యలు రెండు సంవత్సరంలో ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి