calender_icon.png 7 January, 2026 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప సర్పంచ్ పాడే మోసిన ఎమ్మెల్యే తోట

05-01-2026 06:08:11 PM

మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఆదివారం రాత్రి డోంగ్లీ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డోంగ్లీ ఉప సర్పంచ్ శివాజీ రామరావు పటేల్  ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  సోమవారం వారి గ్రామానికి వెళ్లి,  శివాజీ రామరావు పటేల్  భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శివాజీ రామరావు పటేల్  పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే  ఓదార్చారు.అనంతరం అంత్యక్రియలలో పాల్గొని పాడె మోసి అశృనయనాలతో వీడ్కోలు పలికారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. శివాజీ రామ రావు పటేల్  ఆకస్మిక మరణం వారి కుటుంబానికి మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి కూడా తీరని లోటని అన్నారు.గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన ఒక నిబద్ధత,నిజాయితీ గల నాయకుడిని పార్టీ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీకి వారు అందించిన సేవలు మరువలేనివి అని,ఒక బలమైన నాయకుడిని కోల్పోవడం పార్టీ శ్రేణులకు దుఃఖాన్ని కలిగిస్తున్నదని భావోద్వేగానికి గురయ్యారు.