calender_icon.png 7 January, 2026 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ లో భారీ చేరికలు

05-01-2026 06:05:21 PM

కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే

వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ధీమా

కాంగ్రెస్ కు రాష్ట్రంలో కనీసం పది సీట్లు రావన్న మాజీ ఎమ్మెల్యే

కెసిఆర్ అంటే నమ్మకం, రేవంత్ అంటే అమ్మకం

మద్నూర్,(విజయ క్రాంతి) కామారెడ్డి జిల్లా ప్రజావ్యతిరేక పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి రావాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలతో పాటు ఇతరులు పండిత్రావ్ పటేల్ సమక్షంలో  200 మందికి పైగా ఇతర పార్టీల నుండి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేశారు.

వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ..బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల వలే పనిచేయాలని సూచించారు. తెలంగాణ సాధన కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆలుపెరగని పోరాటం చేసిందని గుర్తు చేశారు. ప్రజలకు చేతకాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వనికి ప్రజలు తొందరలోనే తగిన బుద్దిచెబుతారన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పేరుతో పేద ప్రజలను మోసం చేస్తుందని అవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌,బీజేపీ పార్టీ మీద ప్రజలకు నమ్మకం పోయిందని స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే సరికి ఇంకా భారీ ఎత్తున వివిధ పార్టీల నుండి బీఆర్‌ఎస్‌లో పార్టీలోకి చేరుతారని తెలిపారు. పార్టీని నమ్ముకున్న వారికి పార్టీ ఎప్పుడు అన్యాయం చేయదని పేర్కోన్నారు. పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టినవారు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే వారి వారి పేర్లను డైరీలో నోట్ చేసి పెట్టుకోండని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా ఋణం చెల్లుబాటు ఉంటుందని ఆయన ఘాటుగా హెచ్చరించారు. అనంతరం పండిత్రావ్ పటేల్ మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ పార్టీ చేయలేనంత మేలు పెద్ద ఎక్లారా గ్రామానికి బీఆర్ఎస్ పార్టీ చేసిందని ఆయన కొనియాడారు.

బిఆర్ఎస్ పార్టీనీ నమ్ముకున్న ప్రతి కార్యకర్తలకు తమ కుటుంబం అండగా ఉంటుందని కార్యకర్త కాలుకు ముళ్ళు విరిగిన తాము పంటితో తీస్తామని ప్రతి కార్యకర్తను కూడా కంటికి రెప్పలే కాపాడుకుంటామని ఏ కార్యకర్త కూడా దిగులు పడాల్సిన అవసరం లేదని రానున్న రెండు సంవత్సరాలలో కచ్చితంగా బి ఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు ప్రతి కార్యకర్తకి తగు న్యాయం చేస్తామని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. బి ఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రతి కార్యకర్త తమ కుటుంబ సభ్యుడేనని బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి వెంకట్ పటేల్, మాజీ ఎక్లార ఎండోమెంట్ చైర్మన్ ఎస్ హనుమంత్ పటేల్, అశ్వినీ కుమార్ దేశాయ్, రాచోట్టి పర్బన్న, మారుతి, ఎమ్మార్పీఎస్ శంకర్ ,మరియు ఇతర పార్టీల కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.