05-01-2026 05:54:48 PM
సుల్తానాబాద్, (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ మానేరు నుండి కరీంనగర్ కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న మహేంద్ర బొలెరో వాహనాన్ని గర్రెపల్లి గ్రామంలో పట్టుకోవడం జరిగిందని ఎస్ఐ చంద్రకుమార్ సోమవారం తెలిపారు, ఆదివారం రాత్రి ఎస్సై చంద్రకుమార్ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అక్రమ ఇసుక రవణ చేస్తున్న బొలెరో వాహనాన్ని పట్టుకొని, వాహన యజమాని సయ్యద్ వలి, డ్రైవర్ షేక్ బషీర్ ఇద్దరిపై కేసు నమోదు చేసి బొలెరో వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది అని చెప్పారు. ఈ విధంగా ఎవరైనా అక్రమంగా ఇసుక తరలించినట్టయితే ఉపేక్షించేది లేదని ఎస్ఐ చంద్రకుమార్ హెచ్చరించారు.