calender_icon.png 7 January, 2026 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ సింహాల పట్టివేత

05-01-2026 05:52:46 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండల కేంద్రం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గ్రామ సింహాలను పట్టి వేసి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ వీరమల్ల శిరీష _లోకేష్ గౌడు తెలిపారు. సోమవారం ఆయన గ్రామంలో ఉన్న వీధి కుక్కల బెడద నుండి కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడి నుండి తరలించడానికి హైదరాబాదు నుంచి వచ్చిన ప్రత్యేక వారి చేత వ్యాన్లలో తరలించారు. గ్రామంలో ప్రయాణికుల, గొర్రెలను మేకలను కోళ్లను ఈ వీధి కుక్కలు ఇబ్బందులు కలుగజేస్తున్నందువల్ల ప్రజల ఫిర్యాదు మేరకు చేసిన వీధి కుక్కల తరలింపు కార్యక్రమానికి సర్పంచును గ్రామస్తులు కొనియాడారు. జనావాసాల రహిత ప్రాంతాలకు ఈ గ్రామ సింహాలను తరలిస్తున్నట్లు సర్పంచి తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శి యూసఫ్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.