calender_icon.png 15 September, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి..

15-09-2025 06:20:21 PM

పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలకు పెంచాలి..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): మల్టీపర్పస్ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ కార్మికులకు ఉరితాడు బిగించిందని గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ లో నిర్వహించిన సీఐటీయూ అనుబంధం గ్రామ పంచాయితీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా 4వ మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ... జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులు సుమారుగా 800 మంది కార్మికులు పని చేస్తున్నారని, వారి సమస్యలపైన మహాసభల్లో చర్చించడం జరిగిందన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి, జీవో నంబర్ 51 సవరించాలన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా 1వ తేదీన కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి, కనీస వేతనం రూ.26 వేల రూపాయలు ఇవ్వాలన్నారు.

కార్మికుల సమస్యలను పరిష్కారించే దిశగా మహాసభల్లో తీర్మానం చేయడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దర్శనాల మల్లేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఇంద్రాజ్, బొజ్జ ఆశన్న, జిల్లా కోశాధికారి రవి ఉపాధ్యక్షులుగా ఆత్రం సోనేరావు, కిరణ్, అశోక్, సహాయ కార్యదర్శిలుగా అర్కా. వెంకట్రావు, వాగరావ్, తారూరి, గంగన్న జిల్లా కమిటీ సభ్యులుగా సుందర్ అంజయ్య సంతోష్ సాగర్ నూతన కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శి బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్, జిల్లా ఉపాధ్యక్షులు, లింగాల చిన్నన్న అగ్గిమల్ల స్వామి, సహాయ కార్యదర్శి నవీన్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.