17-01-2026 02:07:40 AM
కొమురవెల్లి, జనవరి 16 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో క లిసి వచ్చినా ఆయన గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి పట్నాలు వేసి, బోనం చెల్లించుకున్నారు. అంతకుముందు దేవాలయ అర్చకులు, కార్యనిర్వాహణ అధికారి వెంకటేష్ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆశీర్వచన మండపంలో స్వామి వారి శేష వస్త్రం, చిత్రపటం తో పాటు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు చంద్రశేఖర్, ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్,ఉత్సవ కమిటీ చైర్మన్ గంగం నరసింహారెడ్డి, సభ్యులు సార్ల లింగం, బొచ్చు ఎల్లయ్య, ఎలిగేల మల్లేశం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.