17-01-2026 02:06:33 AM
పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
పాపన్నపేట, జనవరి 16 :మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతికి గ్రామస్తులు గ్రామం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సారి కూడా గ్రామానికి 78వ పుట్టినరోజు వేడుక గురువారం ఘనంగా నిర్వహించారు.
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ విచ్చేసి ముందుగా గ్రామంలోని రామాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్న అ నంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కేక్ కోసి గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్ష లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, లక్ష్మీనగర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. మండల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.