calender_icon.png 17 January, 2026 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడాదికి ఒక్కరోజే దత్త దర్శనం

17-01-2026 02:09:44 AM

  1. పాలమాకుల ‘మునుల బండ’పై రేపే జాతర
  2. సిద్దిపేట జిల్లాలో అరుదైన దత్త క్షేత్రం
  3. మునులు తపస్సు చేసిన పవిత్ర పుణ్యస్థలి

నంగునూరు, జనవరి 16:ప్రకృతి ఒడి లో, ఆధ్యాత్మిక పరిమళాల మధ్య వెలసిన సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని పాలమాకుల శ్రీ దత్తాత్రేయ స్వామి వార్షిక జాతర ఈ ఆదివారం అత్యంత వైభవంగా జరగనుంది.ఏడాది పొడవునా మూ సి ఉంచే ఈ ఆలయ తలుపులు కేవలం మా ఘ అమావాస్య పర్వదినం రోజు తెరుచుకుంటాయి.

మునుల తపస్సు.. మొండి వ్యాధుల నివారణ

వేల సంవత్సరాల క్రితం మునులు ఈ శిలపై తపస్సు చేయడం వల్ల దీనికి ‘మునుల బండ’ పేరు వచ్చిందని గ్రామస్తులు చెబుతారు.బండపై హరినామం ఆకారంలో బ్ర హ్మ, విష్ణు, మహేశ్వర గుండాలు కొలువై ఉ న్నాయి. ఈ గుండంలోని పవిత్ర జలంతో స్నానం ఆచరిస్తే మొండి వ్యాధులు ప్రాప్తి క లుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఈ ఆలయాన్ని పునరుద్ధరించిన చీకోటి వంశస్థులు ఆధ్వర్యంలోనే ఉత్సవాలు జరుగుతు న్నాయి. ఈ గుట్టపై నుండి శనిగరం చెరువు అందాలు, చుట్టుపక్కల పచ్చని పొలాలు అ ద్భుతంగా కనిపిస్తాయి.దత్తన్న దర్శనానికి వచ్చే వారు సమీపంలోని అష్టలక్ష్మి ఆలయా న్ని కూడా సందర్శించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.

జాతరకు భారీ ఏర్పాట్లు

మండల పరిధిలోని పాలమాకుల,రాజగోపాల్పేట, వెంకటాపూర్,ముండ్రాయి గ్రా మాల సరిహద్దులో వెలసిన ఈ క్షేత్రానికి వే ల సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహకులు చెబుతున్నారు.భక్తుల సౌకర్యార్థం చీకోటి వంశస్థులు, గ్రామస్తులు కలిసి భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తా గునీరు, క్యూలైన్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.