03-08-2025 12:54:14 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన పోలోజు వ్యాకరణ చారి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశాడు. ఈ విషయం తెలుసుకున్న అతని బాల్యమిత్రులు, ఇనుగుర్తి హై స్కూల్ 1980-81 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు 25 వేల రూపాయలను స్నేహితుడి కుటుంబానికి అందజేశారు. స్నేహితులంతా స్నేహితుల దినోత్సవం నాడు తమ చిన్ననాటి స్నేహితుడి మరణం పట్ల విషాదం వ్యక్తం చేస్తూ అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పూర్వ మిత్రులు వద్దిరాజు దేవేందర్, పరిపాటి మహబూబ్ రెడ్డి, చిర్రగోని చంద్రమోహన్, కందునూరి వెంకటేశ్వర్లు, రవీంద్ర చారి, వాసుదేవ రెడ్డి పాల్గొన్నారు.