calender_icon.png 3 August, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యాటకులకు షాకిచ్చిన శ్రీశైలం డ్యాం అధికారులు.!

03-08-2025 12:57:40 PM

నీటి ప్రవాహం తగ్గడంతో క్రస్ట్ గేట్లు మూత..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): వీకెండ్ సందర్భంగా నల్లమల టూర్ వెళ్తూ శ్రీశైలం డ్యాం(Srisailam Dam) అందాలు కృష్ణమ్మ పరవళ్ళు కళ్లారా చూసేందుకు వెళ్లాలనుకున్న పర్యాటకులకు శ్రీశైలం డ్యాం అధికారులు షాకిచ్చారు. ఎగువన వరద ప్రవాహం 1,75,000 క్యూసెక్కులకు భారీగా తగ్గుతుండడంతో ఆదివారం ఉదయం ఆరు క్రస్ట్ గేట్లను మూసి కేవలం ఒక్క గేటు ఓపెన్ చేశారు. మరో రెండు గంటలు గడవక ముందే మరో గేటు క్లోజ్ చేశారు. 215 టీఎంసీలో 885 అడుగుల సామర్థ్యం గల శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 882 అడుగుల వద్ద 201 నీటి నిల్వ కొనసాగుతోంది. టిఎంసిగత వారం రోజులగా ఎనిమిది క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ చూపరులను ఎంతగానో ఆకట్టుకొంటూ కనిపించింది. ఆదివారం సెలవు దినం, ఫ్రెండ్షిప్ డే కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో శ్రీశైలానికి చేరుకున్నారు