calender_icon.png 3 August, 2025 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతి లేకుంటే ఇంటి నుంచే దీక్ష చేస్తా: కవిత

03-08-2025 12:49:01 PM

హైదరాబాద్: ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు మాట్లాడలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) మీడియాతో అన్నారు. తనపై కుట్ర చేస్తున్నది బీఆర్ఎస్ పెద్ద నాయకుడేనని కవిత స్పష్టం చేశారు. నేను బలంగా కర్మ సిద్దాంతం నమ్ముతా.. నీకు అది తగులుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కువ సీట్ల ఓటమికి కారణమైన వ్యక్తి నా గురించి మాట్లాడుతారా..? ఆయన తప్పా సీట్ల ఓటమికి కారణమైన లిల్లీపుట్ నేత నా గురించి మాట్లాడుతారా..? కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎవరు..?" అని మండిపడ్డారు. మా నాన్న కేసీఆర్(KCR)కు రాసిన లేఖ బయటకు లీక్ చేసిందెవరు..?, సి.ఎం. రమేష్ ఎందుకు మాట్లాడారో నాకు తెలియదని తెలిపారు. సి.ఎం. రమేష్ నాకు తెలుసు కానీ గత ఆరు నెలల్లో ఎప్పుడూ మాట్లాడలేదని కవిత వివరించారు. ప్రభుత్వం, కోర్టు అనుమతి లేకుంటే ఇంటి నుంచే దీక్ష చేస్తా, మ్యాచ్ ఫిక్సింగ్ చేసే వారే నా వెనుక ప్రభుత్వం ఉంటే ఎలా..? అని తెలిపారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ నేతలు ఎవరూ బీసీల గురించి మాట్లాడలేదన్నారు.