21-06-2025 02:35:43 PM
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): యోగా సాధనతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు(Minister Jupally Krishna Rao) అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Day of Yoga ) సందర్భంగా కొల్లాపూర్ లో పతాంజలి యోగా సమితి ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని ప్రజలు, విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... యోగా భారతీయ ఘన వారసత్వ సంపదని, యోగా ప్రాచీన సంస్కృతిలో ఒక భాగమన్నారు. మన జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా పడుతున్న ఇబ్బందులను అధిగమించడానికి ప్రాచీన జీవన విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. యోగా, ధ్యానంతో మానసిక ఒత్తిడి, శారీరక రుగ్మతలను అధిగమించ వచ్చాన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయసు నుంచే యోగా, ధ్యానం, వ్యాయామాన్ని అలవాటు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిత్యం ఒక గంట పాటు శారీరక వ్యాయామం చేయాలని ఫలితంగా మానసిక, శారీరక సమతౌల్యం కలుగుతుందన్నారు.