calender_icon.png 17 May, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి

16-05-2025 05:40:18 PM

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నల్లగొండ పట్టణాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉంచుకొని అన్ని రకాలుగా కాపాడుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలందరికి పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణాన్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచేందుకు నల్గొండ మున్సిపాలిటీకి నూతన జనరేటర్, జెసిబి, ల్యాడర్, రోబోటిక్ జట్టింగ్ మిషన్ లను శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వివిధ వార్డుల మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది  పాల్గొన్నారు.

పార్థివ దేహాన్ని పరామర్శించిన మంత్రి...

కనగల్ మండలం పగిడిమర్రి గ్రామానికి చెందిన అబ్బిడి నాగార్జున రెడ్డి గురువారం గ్రామంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో నాగార్జున రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సమయంలో ఈయన వెంట కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.