16-05-2025 05:45:46 PM
హుజురాబాద్ కమిషనర్ సమ్మయ్య
హుజురాబాద్,(విజయక్రాంతి): పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య కార్డులు ఎంతోగానో ఉపయోగపడతాయని హుజురాబాద్ పురపాలక సంఘం కమిషనర్ సమ్మయ్య అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ చందుర్, ఎంఓ సుధాకర్ రావుతో కలిసి పారిశుద్ధ్య కార్మికులకు శుక్రవారం ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ కేంసారపు సమ్మయ్య మాట్లాడుతూ... పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటే హుజురాబాద్ పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కమిషన్ సమ్మయ్య అన్నారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ ఆరోగ్య సంరక్షణ కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్డులలో కార్మికుల యొక్క అనారోగ్యం, లక్షణాలను కార్మికులు వాడేమందుల సమాచారం పొందుపరిచి ఉంటుందన్నారు. ఈ కార్డులను ప్రతి పరిశుద్ధ కార్మికుడు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, వినయ్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ రమేష్, జరీనా తో పాటు మున్సిపల్ కార్మికులు సిబ్బంది పాల్గొన్నారు.