08-05-2025 07:30:13 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలంలో రెవెన్యూ శాఖ మంత్రి వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విచ్చేసిన సందర్భంలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు డివి శంకర్రావు(Bhadrachalam City Style Gym Athlete DV Shankar Rao)ని అభినందించి ఘనంగా సన్మానించడం జరిగింది. హైదరాబాదులోని మేడ్చల్ లో 3, 4 తారీకులలో జరిగిన రాష్ట్రస్థాయి పవర్ లిప్టింగ్ పోటీలలో, భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ లో పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రిటైర్డ్ ఎస్బిఐ మేనేజర్ డివి శంకర్రావు బంగారు పతకం సాధించడం జరిగింది.
పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ట్రేజరర్ మహంతి వెంకటకృష్ణాజి రజిత పతకంను సాధించడం జరిగింది. ఈ విషయాన్ని పొంగులేటి పర్యటనలో ఉన్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(MLA Tellam Venkat Rao) రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలియపరిచిన సందర్భంలో అసోసియేషన్ జిల్లా పవర్ లిప్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి ద్వారా వారిని పిలిచి అభినందించి ఘనంగా సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... డివి శంకర్రావుకి 73 సంవత్సరాల వయసులో బైపాస్ సర్జరీ అయినా కూడా పట్టుదల కార్యదీక్షతో పవర్ లిఫ్టింగ్ లో మూడు నెలల సమయంలోనే ఓనమాలుతో ప్రారంభించి ఖమ్మంలో జరిగిన రెండు జిల్లాల స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలలో బంగారు పతకము, మూడు నాలుగు తారీకులలో హైదరాబాద్ మేడ్చల్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ పోటీలలో కూడా బంగారు పతకం సాధించడం జరిగిందనీ, అతి తక్కువ కాలంలోనే ఇంతటి విజయానికి కారణమైన, భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జివి రామిరెడ్డిని, అసోసియేషన్ సభ్యులైన, డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, మహంతి వెంకటకృష్ణాజి, గూగులోతు శోభ నాయక్ లను కూడా ఈ సందర్భంగా అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భోగాల శ్రీనివాసరెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ జివి రామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.