calender_icon.png 9 May, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మూలో ఉద్రిక్త పరిస్థితులు

08-05-2025 10:37:32 PM

జమ్మూ: ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. పాకిస్తాన్ గురువారం జమ్మూను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. కాగా, భారత సైన్యం పాక్ దాడుల్ని తిప్పికొడుతోంది. పాక్ ప్రయోగించిన ఎనిమిది మిసైల్స్(Missiles) ను, డ్రోన్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ కూల్చేసింది. జమ్మూ డివిజన్‌లోని అఖ్నూర్, కిష్వార్, సాంబా నగరాల్లో అధికారులు పూర్తిగా బ్లాక్‌ అవుట్ అమలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలందరూ తమ ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.