calender_icon.png 9 May, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి బస్టాండ్‌లో నగలు చోరీ

08-05-2025 09:24:06 PM

మహిళ మెడలో నుంచి ఎత్తుకెళ్లిన దుండగులు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి కొత్త బస్టాండ్ లో గురువారం సాయంత్రం ఓ మహిళ ప్రయాణికురాలు హ్యాండ్ బ్యాగులు దాచిన బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. నిజాంబాద్ జిల్లా సిరికొండ మండలం మైలారం గ్రామానికి చెందిన సుధేష్ణ అనే మహిళ హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా కామారెడ్డి కొత్త బస్టాండ్ లో బస్సు దిగి సిరికొండ బస్సు ఎక్కి చూసుకునేసరికి హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న నగలు చోరీకి గురైనట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. తమ పిల్లలను హైదరాబాద్ నుంచి తీసుకుని వస్తుండగా కొత్త బస్టాండ్ వద్ద బస్సు దిగి మరో బస్సు ఎక్కగా హడావిడిలో ఉన్న ఆమె హ్యాండ్ బ్యాగ్ నుంచి నగలను అపహరించారు. సంఘటన కలకలం రేపింది.

సుమారు8 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదు లో పేర్కొన్నారు. బస్టాండ్ లో వరుసగా చోరీలు జరుగుతూ ఉండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు సెల్ ఫోన్లు చోరీ కి గురవుతున్నాయి. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న కొత్త బస్టాండ్ లో చోరీలు జరగడం పోలీసులకు సవాల్ గా మారింది. సి  సి కెమెరాలు ఉన్నా కూడా చోరీలు జరగడం , మహిళ ప్రయాణికుల బంగారు నగలు చోరీకి గురవడం ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. బస్టాండ్ లో పోలీస్ సిబ్బంది ఆర్టీసీc అధికారులు నిత్యం ఉంటున్న జేబు దొంగలు గుర్తు తెలియని దుండగులు చోరీలకు పాల్పడడం పోలీసులకు సవాల్ గా మారింది. ఇప్పటికైనా పోలీస్ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు దొంగతనాలను అరికట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.