08-05-2025 10:09:32 PM
మణుగూరు (విజయక్రాంతి): ఇటీవల విడుదలైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో మణుగూరు సింగరేణి పాఠశాలకు చెందిన కర్నె తేజసాయి విద్యార్ధిని అత్యున్నత ప్రతిభ కనబరచి 600 మార్కులకు గాను 552 మార్కులు సాధించి పాఠశాలలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మణుగూరు ఏరియా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం విద్యార్థిని తేజసాయితో పాటు ఆమె తల్లిదండులను సన్మానించారు.
ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ దిశ నిర్దేశం, పాఠశాల కరస్పాండెంట్ రమేష్ నిరంతర పర్యవేక్షణ, అంకితభావం అనుభవజ్ఞులైన అధ్యాపకుల విద్య బోధన ద్వారా మణుగూరు సింగరేణి పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా నిర్వహిస్తూ ప్రతి ఏటా అద్భుతమైన ఫలితాలు సాధిస్తుండటం అభినందనిమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇజ్రాయిల్, బంగారి పవన్ కుమార్, మునిగేల నాగేశ్వర రావు, మస్తాన్, సేవా వినయ్ కుమార్, నరేష్, కళ్యాణ్ కుమార్, రమేష్, శ్రీనివాస్, రేవన్, రఫీ, కుమారస్వామి, సమర్పన్ తదితరులు పాల్గొన్నారు.