calender_icon.png 8 May, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ్యాణ లక్ష్మి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలి

08-05-2025 07:34:44 PM

60 మంది మహిళ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ..

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు..

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో కళ్యణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా విచ్చేసి 60 మంది లబ్ధిదారులకు రూ.60,06,960 విలువచేసే చెక్కులను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(Thungathurthi MLA Mandula Samelపంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సారధ్యంలో ప్రజాపాలనలో పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. గత ప్రభుత్వ అవినీతితోనే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, దాసరి శ్రీను, తాసిల్దార్ దయానంద్, ఎంపీడీవో శేషు, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, రెవెన్యూ సిబ్బంది వివిధ గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు.