08-05-2025 10:14:27 PM
కోదాడ: పాకిస్తాన్ లో ఉగ్రవాదులను తుది ముట్టించేందుకు భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. గురువారం కోదాడ పట్టణంలోని ఐవిఓ రోడ్డులో గల 100 అడుగుల జాతీయ జెండా వద్ద దేశ మాజీ సైనికులు, ఐవిఓ సభ్యులు భారత్ మాతాకీ జై, జై భారత్, జై హింద్, జై జవాన్, జై కిసాన్ అంటు జాతీయ జెండాలు చేతపట్టి నినాదాలు చేశారు. ఐవివో సూర్యపేట జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుండా మధుసూదన్ రావు, కె.వెంకన్న, జగిని ప్రసాద్, సామినేని రమేష్, సేకు శ్రీనివాస రావు, జి.నవీన్ బెలిదె భరత్ షేక్ రహీమ్ పాల్గొన్నారు.