calender_icon.png 9 May, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లాపూర్ అంగన్వాడీలో మంటలు

08-05-2025 10:04:58 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం కిటికి వద్ద గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడంతో మంటలు అంటుకొని విలువైన సామగ్రి కాలిపోయిన ఘటన బుధవారం రాత్రి అల్లాపూర్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లాపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ అధికారులు తనిఖీ చేసి వెళ్లారు. వారు వెళ్లగానే టీచర్ తాళం వేసి ఇంటికి వెళ్లింది.

వెళ్లిన కొన్ని నిమిషాల్లో కిటికి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో పొగలు కమ్మేయడంతో అది చూసిన స్థానికులు వెంటనే నీళ్లు పోసి మంటలు అదుపు చేశారు. లోనికి వెళ్లి చూడగానే పలు వస్తువులు చెడిపోయింది. భవనమంతా పొగ కమ్మేయడంతో పైకప్పు నల్లబారింది. మంటలు అంటుకున్న ప్రాంతం పక్కనే సిలిండర్ ఉంది. దానికి నిప్పు అంటుకొని ఉంటే పెద్ద నష్టం జరిగేదని వారు చెప్పారు. విద్యుత్తు తీగలు కాలిపోయాయని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అంగన్వాడీ టీచర్ సావిత్రి పేర్కొన్నారు.