08-05-2025 09:02:09 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar Goud) 58వ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 58వ పుట్టినరోజు సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆద్వర్యంలో రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నంను గురువారం హైదరాబాద్ లో మంత్రి పొన్నంను కలిసి పూల మొక్క ఇచ్చి ప్రణవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి కొట్లాడిన వ్యక్తి, నిజమైన ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ అని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లులో తనదైన ముద్ర వేస్తూ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంలో విశేష కృషి చేశారని, భవిష్యత్ లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రణవ్ కోరారు.