27-11-2025 04:37:21 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. మండలంలో 7 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో సత్తెనపల్లి, పాత ఎల్లాపూర్, గోసంపల్లి, సుర్జాపూర్, మస్కాపూర్, కేంద్రాలను గురువారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్ ఆయేషా మస్రత్ ఖాణం, అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థల పైజాన్ అహ్మద్, జిల్లా పరిషత్ సీఈవో గోవింద్ లు పరిశీలించారు. ప్రక్రియ సజావుగా సాగాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. వారి వెంట ఖానాపూర్ ఎంపీడీవో రమాకాంత్ తాసిల్దార్ సుజాత రెడ్డి ఎంపీఓ రత్నాకర్ రావు తదితరులు ఉన్నారు.