calender_icon.png 27 November, 2025 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత

27-11-2025 04:39:43 PM

ముత్తారం పోలీస్‌ స్టేషన్ తనిఖీలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్..

ముత్తారం (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికలు గోదావరిఖని సబ్ డివిజన్ లో ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. గురువారం ముత్తారం పోలీస్‌ స్టేషన్ ను ఏసీపీ తనిఖీ చేశారు. పోలీస్  స్టేషన్ రికార్డ్స్ ను పరిశీలించి, కేడి, డీసి, సస్పెక్ట్ షీట్ లు పరిశీలించారు, వారి ప్రస్తుత చర్యల గురించి ఎస్ఐ ని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ వెర్టికల్స్, ఎఫ్ ఐఆర్ ఇండెక్స్ మొదలైన రికార్డ్స్ తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో మండలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎ‌స్ఐకి తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూసుకోవాలని సూచించారు. నిరంతం పోలీసులు పెట్రొలింగ్‌ నిర్వహించాలని స్టేషన్‌ అధికారులకు సూచించారు. ఈ తనిఖీల్లో మంథని సీఐ రాజు, ముత్తారం ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, సిబ్బంది ఉన్నారు.