27-11-2025 04:42:06 PM
ముంపు బాధితులకు 50 లక్షల రూపాయల పరిహారం అందించాలి
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకరాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా నిర్మాణం చేపట్టి నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. గురువారం నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని ఆమె సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందించే విధంగా ప్రారంభించిన ఈ పథకాన్ని తొందరగా పూర్తి చేయాలని, పథకంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు.