27-11-2025 04:32:42 PM
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్...
మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు...
సుల్తానాబాద్ (విజయక్రాంతి): అయ్యప్ప మాలధారణ స్వాములు నిత్య అన్నప్రసాద వితరణను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపెల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావులు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నీరుకుల రోడ్డులో గల అయ్యప్ప ఆలయంలో ఈ నెల 27 నుంచి 45 రోజులపాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ బుచ్చిరెడ్డి తెలిపారు. నిత్య అన్న ప్రసాద వితరణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ తో కలిసి ప్రారంభించారు.
అంతకు ముందు పూజారి సద్దనపు రవీంద్ర చారి అయ్యప్ప స్వామి వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. ఇందులో పాల్గొన్న అతిధులందరినీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో శనిగరపు శంకరయ్య, జిల్లా రైస్ మిల్లుల అసోసియేషన్ సంక్షేమ సంఘం అధ్యక్షులు నగునూరి అశోక్ కుమార్, మాడురి ప్రసాద్ , సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, శ్రీవేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్ పల్ల మురళీధర్, సుల్తానాబాద్ శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, పన్నాల రాములు, సుల్తానాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ డైరెక్టర్ సామల యమున హరికృష్ణ, అభినవ్, రాజు, అయ్యప్ప మాలధారణ స్వాములు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.