13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

రూ.4 కోట్లతో పూలే విగ్రహాలు — ఏప్రిల్ 11న రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం!

31-03-2026 02:23 PM

హైదరాబాద్: ట్యాంక్ బండ్ ఐమాక్స్ థియేటర్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్ వద్ద ఏప్రిల్ 11 వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) చేతుల మీదిగా ప్రారంభించుకునే మహాత్మా జ్యోతిబాపూలే,సావిత్రి బాయి పూలే విగ్రహ( Jyotirao Savitribai Phule Statues) నిర్మాణ పురోగతి పనులను మంత్రి కొండా సురేఖతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... ప్రగతి భవన్ ను జ్యోతిబాపూలే ప్రజాభవన్ గా మార్చుకున్నామని తెలిపారు.

లేక్ వ్యూ  పార్క్ మార్గాలన్ని పూలే మార్గ్ గా మార్చాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) సూచించారని తెలిపారు. పూలే మార్గ్ గా పేరు మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. రూ. 4 కోట్లతో పులే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రెండు రోజుల ముందే విగ్రహ ఏర్పాటు పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సభ ప్రాంగణంలో ఎవరికి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ , ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కవ్వంపల్లి సత్యనారాయణ, నవీన్ యాదవ్, కాలేరు వెంకటేష్ , ముఠా గోపాల్ , బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ , మాజీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, కార్పొరేషన్ చైర్మన్ లు, నూతి శ్రీకాంత్ గౌడ్ ,మెట్టు సాయి కుమార్, జెరిపాటి జైపాల్ , బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్ ,దాసు ,బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు పాల్గొన్నారు.