08-11-2025 05:08:15 PM
కోనరావుపేట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మందాల లింబయ్య ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ప్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండ నర్సయ్య మాట్లాడుతూ ప్రజా పాలనలో నిరుపేదలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డును పంపిణీ చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డును అందిస్తున్నారని పేర్కొన్నారు.
పేదలకు సన్న బియ్యం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మ్యాకల ప్రభాకర్ రెడ్డి, కరెడ్ల రమేష్ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు ముదాం ప్రదీప్, మాజీ ఎంపీటీసీ నర్సింహాచారి, నాయకులు తోట మల్లేశం, మంగినిపెల్లి శంకర్, రాస రవీందర్ రెడ్డి, కాశీరం, లింబయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.