05-09-2025 11:22:12 AM
హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనం(Ganesh immersion) సందడి షురూ అయింది. ట్యాంక్ బండ్(Tank Bund) పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) శుక్రవారం నాడు పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఏర్పాటు పరిశీలించారు. క్రేన్ 4,5 పాయింట్ల వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించినట్లు పొన్న ప్రభాకర్ పేర్కొన్నారు. పోలీస్ భద్రత(Police Security), విద్యుత్, శానిటేషన్,తాగునీరు తదితర అంశాలపై భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం(Khairatabad Ganesh immersion) జరిగే ప్రాంతాన్ని పరిశీలించి.. వినాయక నిమజ్జనం లో ఇబ్బందులు లేకుండా మరింత లోతుగా చేసినట్లు అధికారులు వెల్లడించారు. గత మూడు రోజులుగా జరుగుతున్న నిమజ్జనం తర్వాత ఏర్పడిన వ్యర్థాల తొలగింపు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. మంత్రి పొన్నం వెంట జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు అధికారులు ఉన్నారు. అటు ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన సందడి కొనసాగుతోంది. అబిడ్స్ నుంచి ఎన్టీమార్గ్ వైపు గణనాథులు బారులు తీరారు. కాగా ఇప్పటికే నిమజ్జానాల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఇతర వాహనాలు రాకుండా కట్టుదిట్టం చేశారు.