07-09-2025 06:24:13 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల కేంద్రంలోని శ్రీ సాయి గణేష్ యువజన సంఘం లడ్డులను శనివారం రాత్రి వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాట హోరా హోరిగా సాగిన వేలం పాటలో చివరకు మొదటి లడ్డును లక్ష రూపాయలకు ప్రవీణ్ గౌడ్ దక్కించుకున్నారు. రెండవ లడ్డును 45 వేల రూపాయలకు మంచే సాయిలు దక్కించికున్నారు. వేలం పాట అనంతరం శ్రీ సాయి గణేష్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నవ రాత్రులపాటు పూజలందుకున్న గణనాథుడు శనివారం రాత్రి విద్యుత్ కాంతుల మధ్య నిమజ్జనానికి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి గణేష్ యువజన సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.