07-09-2025 05:59:49 PM
కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డిఈఓ చేతుల మీదుగా అంబటి. రేణుక అవార్డు, ప్రశంస పత్రం స్వీకరణ.
తుంగతుర్తి (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయురాలుగా అంబటి రేణుక ఎంపికై కలెక్టర్ హనుమంతరావు(Collector Hanumantha Rao), అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, డీఈఓ సత్యనారాయణ చేతుల మీదుగా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయురాలుగా అవార్డు స్వీకరించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన అంబటి రేణుక, చిన్నతనం నుండి తుంగతుర్తిలో విద్యాభ్యాసం నిర్వహించి, మొదట పీఈటిగా ప్రభుత్వ వ్యాయామ ఉద్యోగాన్ని పొందారు. దీనితో యాదాద్రి జిల్లా, రామన్నపేట మండలం వెల్లంకి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పిడి గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తూ జిల్లా, రాష్ట్ర జాతీయస్థాయిలో వారి పాఠశాల నుండి, ఎంతోమంది విద్యార్థులు క్రీడల్లో రాణించుటకు అశేష కృషి చేశారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని, సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జిల్లా అధికారులు అంబటి రేణుకను జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయురాలుగా ఎంపిక చేసి, అవార్డు, ప్రశంస పత్రంతో ఘనంగా సన్మానించారు. దీంతో తుంగతుర్తి మండలంలోని స్నేహితులు, బంధువులు, మేధావులు హర్షం వ్యక్తం చేశారు.