calender_icon.png 7 September, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఆన్ లైన్ స్టడీ లోన్ పేరిట సైబర్ మోసం

07-09-2025 05:54:37 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణానికి చెందిన విద్యార్థి తన పై చదువు కోసం ఆన్లైన్ లో స్టూడెంట్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోగా సైబర్ నేరగాళ్లు బాధిత విద్యార్థి ఆధార్, పాన్ కార్డ్ వివరాలు సేకరించి 37,500/ రూ. కొల్లగొట్టిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. పట్టణ ఎస్సై రాజశేఖర్(SI Rajasekhar) తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని 3వ జోన్ లో నివాసం ఉండే యువకుడు తన పై చదువు కోసం 50,000/-రూపాయలు విద్యార్థి లోన్ కోసం ఆన్ లైన్ లో ఒక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకున్నాడు. దీనిని గ్రహించిన సైబర్ నేరగాళ్లు అతని ఆధార్, పాన్ కార్డు, ఇతర వ్యక్తిగత వివరాలను సేకరించారు. లోన్ ఆమోదం పొందిందని నమ్మించి వివిధ రకాల చార్జీల పేరుతో విడతల వారీగా అతని వద్ద నుంచి మొత్తం 37,500/- వసూలు చేశారు.

డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత కూడా లోన్  రాకపోవడంతో తాను మోసపోయానని బావించి  వెంటనే అప్రమత్తమై సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వ్యక్తిగత వివరాలైన ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఓటిపి వంటి వాటిని ఎవరికి ఇవ్వరాదన్నారు. అనుమానాస్పంద ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ లింకులను  క్లిక్ చేయవద్దని, లోన్, ఉద్యోగం, బహుమతి వంటి వాటికోసం ఎవరైనా ముందస్తుగా డబ్బులు చెల్లించమని కోరితే, అది మోసమని అనుమానించాలని సూచించారు. పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని కోరారు.