07-09-2025 05:57:53 PM
కామారెడ్డి (విజయక్రాంతి): బీసీ సభను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినందుకు స్థలాలను ఆదివారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy), పొన్నం ప్రభాకర్ గౌడ్, శ్రీహరి ముదిరాజ్, సీతక్క, ఎంపీ సురేష్ షెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, జుక్కల్ ఎమ్మెల్యే తోటలక్ష్మీ కాంతారావు, కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, బాలరాజు, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తదితరులు కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియం, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. రెండు లక్షల మందితో బీసీ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. సభకు కావాల్సిన ఏర్పాట్లు, ప్రజలు సరిపడేంత స్థలం ఉన్న తీరును పరిశీలించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించేందుకు స్థలాన్ని ఎంపిక చేశారు.