07-09-2025 06:04:17 PM
సిరిసిల్ల (విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో ఆదివారం వినాయక నిమజ్జన వేడుకలు సిరిసిల్ల మానేరు తీరంలోని బ్రిడ్జి వద్ద, ప్రేమ్ నగర్ లో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha), ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ బోటులో మానేరు నదిలో నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు.ఇక్కడ సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.