07-12-2024 02:47:33 PM
కేసీఆర్ ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9న నిర్వహించనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఢిల్లీ కేంద్రంగా జరిగిన పోరాటాల జ్ఞాపకాలను ఇద్దరు నేతలు నెమరువేసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ప్రభుత్వ ప్రోటోకాల్, ప్రజాసంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రొటోకాల్ విభాగం డైరెక్టర్ వెంకటరావు ఉన్నారు.