28-07-2025 09:35:14 PM
మునిపల్లి: డెక్కన్ టోల్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్(Deccan Tollways Private Limited) సహకారంతో మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొత్తగా నిర్మించిన వెయిటింగ్ హాల్‌ను సోమవారం డెక్కన్ టోల్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ రీజినల్ హెడ్ వినీష్ కుమార్, ప్రాజెక్ట్ హెడ్ రాజేష్ విచారేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఓపిడి వెయిటింగ్ హాల్ రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సంధ్యారాణి, పీహెచ్ ఎన్ చంద్రభాను, సూపర్ వైజర్ విజయలక్ష్మి, వైద్య సిబ్బంది, డెక్కన్ టోల్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.