calender_icon.png 29 July, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయ ఆవరణలో వంట గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే

28-07-2025 10:05:52 PM

పటాన్ చెరు: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మహదేవుని ఆలయంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన వంటగదిని సోమవారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వామివారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, గూడెం మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ గౌడ్, కంకర శ్రీను, వెంకటేష్, శంకర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.